రైతు భరోసా కేంద్రాలు ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే ఆమర్నాధ్


కశింకోట మే 30 సమైక్యాంధ్ర :వ్యవసాయ సంబంధ సేవలన్నింటినీ గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ద్వారా పొందవచ్చు అని ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్ అన్నారు. శనివారం మండలంలోని కన్నూరుపాలెం రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే ఆమర్నాధ్, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు దాడి రత్నాకర్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు భరోసా పథకం ముఖ్యమంత్రి తీసుకుని రావడం జరిగింది అన్నారు. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 49 లక్షల రైతు కుటుంబాలకు రూ.10 వేల కోట్లు జమ చేయడం జరిగిందని అన్నారు. పెట్టుబడి ఖర్చులు తగ్గాలని, పంటకు గిట్టుబాటు ధర కలిపించాలని, ఈ కేంద్రాల ద్వారా విత్తనం మొదలు పంట అమ్మకం వరకూ సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. రైతు పూర్తి స్థాయిలో వ్యవసాయ మీద దృష్టి పెట్టేలాగా పంట రుణాలు, ఇన్స్యూరెన్స్, గిట్టుబాటు ధర కల్పించేలా రైతు భరోసా కేంద్రాలు పనిచేస్తాయని వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. వైసీపీ హౌపార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు రత్నాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో రైతులు సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవడం జరిగింది అని,రైతు కన్నీళ్లు, బాధలు పరిష్కరించేందుకు రైతు భరోసా కేంద్రాలను ఏడాది పాలనలోనే అమల్లోకి తీసుకుని వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేసి,పశుసంవర్ధక స్టాల్ ను పరిశీలించారు. కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబు, కశింకోట, అనకాపల్లి మండల వైసీపీ అధ్యక్షులు గొల్లవిల్లి శ్రీనివాసరావు, గొర్లి సూరిబాబు జిల్లా వైసీపీ కార్యదర్శి దంతులూరి శ్రీధర్ రాజు,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మలసాల కిషోర్, వైసీపీ నాయకులు లగిశెట్టి గణేష్, కలగా గున్నయ్య నాయుడు, వియ్యపు భూలోక నాయకుడు,కరక శేషు,మండల వ్యవసా వ్యవసాయ అధికారి గుడివాడ హరికృష్ణ, పశుసంవర్ధక వైద్యులు, పాల్గొన్నారు.