మే 30 (సమైక్యాంధ్ర) :ఎన్నికలకు ముందు తాను అనంతపురం జిల్లాలో పర్యటించానని.. అక్కడ ప్రజ ల్ని అడిగితే టీడీపీకి ఓటు వేస్తామని చెప్పారని.. కానీ ఎన్నికల నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. జేసీ దివాకర్ రెడ్డి. ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (జగన్) ఏడాది పాలన, నిమ్మగడ్డ రమేష్ కేసులో హై కోర్టు తీర్పుపై ఆసక్తి రవ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఏపీకి జగన్ వంటి ముఖ్య మంత్రి మళ్లీ దొరకడన్మిసీ కొనియా డారు. సీఎం జగన్ ఏడాది పాలనకు వందకు 110 మార్కులు వేస్తానని గతంలోనే చెప్పాన ని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల్లో ఓట్ల కోసం సంక్షేమంపై జగన్ ఫోకస్ పెట్టారని.. కానీ సంక్షేమ పథకాలను 2019 ఎన్నికల్లో ఆదరించ లేదన్నారు. ఎన్నికల కు ముందు తాను అనంతపురం జిల్లాలో పర్యటించా నని చెప్పారు. అక్కడ ప్రజల్ని అడిగితే టీడీపీకి ఓటు వేస్తామని చెప్పారని.. కానీ ఎన్నికల నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు.
జగన్ పాలనకు 100కు 110 మార్కులు.. జేసీ దివాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు