మోసపూరిత మాటలతో ప్రజలను నమ్మించకండి


అనకాపల్లి మే 30 (సమైక్యాంధ్ర) : (సమైక్యాంధ్ర) : అబద్దాలతో మోసపూరిత మాటలతో పుట్టిన ప్రభుత్వం అబద్ధాలతోనే జీవిస్తుందని శాసనమండలి సభ్యులు బుద్ధ నాగ జగదీశ్వరావు విమర్శించారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఈ విధంగా అయినా ప్రజలను మోసం చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యం ఈ సంవత్సర కాలంలో 80 వేల కోట్లు అప్పులు 50వేల కోట్లు ప్రజలపై పన్నుల భారం మోపీ జన వంచన లో జగన్ ఘనుడని అన్నారు. ఏడాది జగన్ పరిపాలన ద్వారా రాష్ట్రానికి ప్రజలకి చేకూరిన ప్రయోజనం ఏమిటని జగదీష్ ప్రశ్నించారు ప్రజా వ్యతిరేక పాలన ద్వారా తీసుకున్న నిర్ణయాలు హైకోర్టు అరవై ఆరు సార్లు మొట్టికాయలు వేసింది అని అయినా బుద్ది రాలేదు అని అమాయకులు మహిళలు పై కేసులు నమోదు చేయడం ప్రశ్నించే వారిని జైలుకు పంపడం రివాజీగా మారిందన్నారు. ఒక్క ఛాన్స్ అన్న నినాదాన్ని ఆకర్షితులై జగన్ కు అధికారం ఇచ్చిన ఏడాదికే తెలుగు ప్రజలు తెల్లబోయారు అహంకారం ప్రతీకారం నియంతృత్వం వంటి అవ లక్షణాలు ప్రజలు ఇచ్చిన అపూర్వ అధికారాన్ని అభాసుపాలు చేశారని నాగ జగదీష్ మిడతల దండు నుంచి విమర్శించారు. ఈ సంవత్సరం కాలంలో జగన్ సాధించిన విజయాలు ఏమిటయ్యా అంటే చిధ్రమైన ఆర్థిక రంగం కుదేలైన వ్యవసాయ రంగం అస్తవ్యస్తమైన గ్రామీణ జీవనం పతనమైన పారిశ్రామిక రంగం గుట్టల గా పేర్కొన్న నిరుద్యోగం పడకేసిన సాగునీటి రంగ మితిమీరిన అవినీతి బస్ చార్జీలు పెంపు పెట్రోల్ ధరలు పెంపు కరెంటు చార్జీల పెంపు మద్యం ధరలు పెంపు నిర్వీర్యమైన మౌలిక సదుపాయాలు మాత్రమే అన్నారు. ప్రమాదంలో ప్రజారోగ్యం కూనరీళ్లుతున్న విద్యారంగం మొత్తంగా ప్రజాస్వామ్యం అపహాస్యం చట్టం ధర్మం న్యాయం నీతి రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇచ్చారని నాగ జగదీష్ తెలిపారు. నవరత్నాలు అంటే కొండంత రాగం తీసి అధికారంలోకి వచ్చిన నవరత్నాలు అమలు నైవేద్యం పెట్టి చేతులు దులుపుకుంటున్నారు ప్రతి పథకం లోనూ అరకొర తప్ప ఏదైనా ప్రజల నింపేది కాదు బడుగు బలహీన వర్గాలకు కాపు కార్పొరేషన్ హరిజన గిరిజన కేటాయించిన నిధులను నవరత్నాలకి మళ్లించి ఇతరుల ప్రయోజనాల్ని దెబ్బతీశారు ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురుచూస్తున్న పోలవరం ప్రాజెక్ట్ గోదావరి లో కలిపారు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది ఒక్క యూనిట్ కాంక్రీటు కూడా ఈ సంవత్సరం కాలంలో జరగలేదని 2021 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఉత్తర కుమార ప్రగల్బాలు పలుకుతున్నారు నాలుగు లక్షల మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు పద్దతిలో నియమించిన నిరుద్యోగ యువతీ యువకులను తొలగించి తమ పార్టీకి సంబంధించిన రెండు లక్షల 40 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఘనత సాధించినట్టు నిరుద్యోగ సమస్య నిర్మూలించినట్టు పత్రికా ప్రకటన లతో ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో ఉపాధి అభివృద్ధి పనులకు కేంద్రం ఇచ్చిన నిధులు బిల్లులు చెల్లించకుండా ఇతర ప్రయోజనాలకు తమకు కావాల్సిన కాంట్రాక్టర్లుకు కమిషన్ ఇచ్చేవారికి చెల్లిస్తున్నారు. డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ చేస్తామని జనవరి 9వ తేదీన మొదటి వాయిదా చెల్లిస్తామని మహిళలను మోసం చేశారు ఇసుక కృత్రిమ కొరత సృష్టించి వంద రోజులు భవన నిర్మాణ కార్మికులకు పొట్ట గొడవని పరిసితిని సపించి ఇసుక దోపిడీకి తెరలేపారు కరోనా వెరస్ భయంకరమైన అంటువ్యాధి నిర్మూలన చేయడంలో ప్రభుత్వం విఫలమైందని 60 రోజులు వలస కార్మికులు రోడున పడ్డారని ఆకలితో అలమటిస్తూ ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వం స్పందించలేదని ప్రభుత్వ అధికార యంత్రాంగానికి ప్రధానమైన చీఫ్ సెక్రటరీ పోలీస్ బాస్ డిజిపి వంటివారిని హైకోర్టు తిప్పుతున్న ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందని శాసనమండలి సభ్యులు శ్రీనాగ జగదీష్ విమర్శించారు ఇకనైనా ప్రజలకు మంచి జరిగే విధంగా పాలన చేయాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అద్యక్షులుడాక్టర్ నారాయణరావు, నూకాంబిక దేవస్థాన మాజీ చైర్మన్ కొణతాల వెంకటరావు, పాల్గొన్నారు.