డప్పు కళాకారులని ప్రభుత్వం ఆదుకోవాలి


అనకాపల్లి మే 30 (సమైక్యాంధ్ర) :చర్మకార వృత్తి చేసుకొని జీవించే చెప్పులు కుట్టుకుని బ్రతికే నిరుపేదలను డప్పు కళాకారులను ప్రభుత్వం మానవత్వం తో అదుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కమిటీ ఇంచార్జ్ సూదికొండ మాణిక్యాలరావు విజ్ఞప్తి ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో గత రెండు నెలలు గా వృత్తి పని లేక ఉపాధి మార్గం లేక త్రివృ ఆర్థిక ఇబ్బందులు తో అర్ధాకలి తో అలమటిస్తున్న ఆయా వృత్తి దారులను ప్రభుత్వం కరోనా ఆర్థిక భృతి కల్పించి అదుకోవాలని అయన విజ్ఞప్తి చేశారు. ఈ రోజు అనకాపల్లి పట్టణం ప్రాంతం లో పలు ప్రాంతము లలో గల చెప్పులు కుట్టుకుని జీవించే వృత్తికార్మికులు ను కలిసి వారి కష్టాలు ను ఇబ్బందులు ను అడిగి తెలుసుకున్నారు అనకాపల్లి మరియు తుమ్మపాల వంటి ప్రాంతము లలో సుమారు 200 కుటుంబము లకు పైగా ఈ చెప్పులు కుట్టుకునే వృత్తి మీదే ఆధారపడి జీవిస్తున్నాయని వారిలో ఎక్కువ శాతం ఆయా ప్రదేశముల లో జరిగే సంతలు వద్ద వృత్తి చేసుకుని జీవిస్తుంటాం అని అని అన్నారు ప్రస్తుతం కరోనా నేపథ్యంలో సంతలు లేక రోడ్డు మీద జనసంచారం కూడా లేక పోవడం తో తాము ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నము అని ప్రభుత్వం మమ్మల్ని అదుకోవాలని కోరారు వారి ఇబ్బందులు ను ప్రభుత్వం ద్రుష్టి కి తీసుకోని వెళ్లి వారిని ప్రభుత్వం ఆదుకునేల పార్టీ తరుపున పోరాటం చేస్తాం అని మాణిక్యాలరావు వారికీ హామీ ఇచ్చారు.