తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం అంటే భక్తులకు ఎంతో మమకారం.. తిరుపతి వెళ్తున్నారంటే.. లడ్డూ తీసుకురా అని చెప్పే స్నేహితులు, బంధువులే ఎక్కువంటే.. ఆయన లడ్డూ ప్రసాదానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.. అయితే, కరోనా లాక్‌డౌన్‌తో శ్రీవారి దర్శనంతో పాటు.. లడ్డూ ప్రసాదాలు కూడా భక్తులు దూరమయ్యాయి.. లాక్‌డౌన్ నుంచి కొన్ని మినహాయింపులు రావడంతో.. తిరిగి లడ్డూల తయారీని ప్రారంభించింది టీటీడీ.. ఇప్పటికే గత 6 రోజులుగా ఏపీలో 13 జిల్లాల్లో లడ్డూలను విక్రయించగా.. దాదాపు 13 లక్షల మంది భక్తులు లడ్డూ ప్రసాదాలను కొనుగోలు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.. ఇక, ఇదే సమయంలో ఇవాళ్టి నుంచి హైదరాబాద్‌లో శ్రీవారి లడ్డూ ప్రసాదాలను పొందవచ్చు. హైదరాబాద్ హిమాయత్ నగర్‌లోని టీటీడీ కార్యాలయంలో వీటిని విక్రయించనున్నట్లు టీటీడీ ప్రకటించింది.. దీని కోసం ఇప్పటికే తిరుమల నుంచి 40 వేల లడ్డూలను హైదరాబాద్‌కు పంపించినట్లు టీటీడీ తెలిపింది. ఒక లడ్డూను రూ.25కే అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు.
లడ్డూ లాంటి వార్త.ఇక్కడే శ్రీవారి లడ్డూ ప్రసాదం.